Tuesday, May 20, 2025
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్...వారికి నెలకు రూ. 4,500

తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్…వారికి నెలకు రూ. 4,500

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అంశాన్ని ప్రకటించింది. నెలకు రూ.4,500 అందిస్తామనే శుభవార్త తీసుకువచ్చింది.
రాష్ట్రంలోని అనాథలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అనాథ పిల్లలకు అండగా ఉంటామని వివరించారు. దీనికి సంబంధించి కీలక ప్రకటన చేశారు.
కాంగ్రెస్ గవర్నమెంట్ అర్హులు అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేస్తోందని తెలిపారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రభుత్వం మానసిక ధైర్యాన్ని కల్పిస్తుందని భరోసా ఇచ్చారు.
హైదరాబాద్‌లో శిశువిహార్‌ సంరక్షణలో ఉన్న అనాథ చిన్నారుల వద్దకు వెళ్లారు సీతక్క. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆమె వారికి ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు. టూరిజం ప్లాజాలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీతక్క స్వయంగా చిన్నారులకు భోజనం కూడా తినిపించారు.
కాగా ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఒక్కొక్కరికి రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని మనకు తెలిసిందే. ఇదే విషయాన్ని సీతక్క కూడా వెల్లడించారు. అందుకే ప్రతి కుటుంబం ఆరోగ్యశ్రీ కార్డును కలిగి ఉండటం ఉత్తమం.
సీతక్క మాట్లాడుతూ.. ముందుగా హైదరాబాద్‌ భాగ్య నగరంలోని 2,200 మందికి ఈ కార్డులు ఇస్తున్నామని తెలిపారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్డులను అందజేస్తామని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అనాథల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వీరి కోసం ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తోందని ఆమె గుర్తు చేశారు. ఆర్థిక భరోసా, ఆసరా లేని పిల్లల్ని చేరదీసి, వారిని సంరక్షిస్ అంటే బాగా చూసుకుంటే.. అలాంటి వారికి నెలకు రూ.4,500 ఇస్తామని ప్రకటించారు. అనాథ పిల్లల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ ప్రోత్సాహకం వల్ల అనాథ పిల్లలకు భరోసా లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి నిర్ణయం వల్ల అనాధలకు ఆర్థిక చేయూత లభిస్తుందని అనుకోవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -