నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లి గ్రామానికి చెందిన బేత నర్సమ్మ అనే వృద్ధురాలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందింది. ఆమె దశదినకర్మకు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ జాజ చంద్రం ఆధ్వర్యంలో బిఆర్ ఎస్ బీరెల్లి శ్రేణులు 3000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. వారి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రధాన కార్యదర్శి పోగు నాగేష్, బీరెల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు దాయ రోషన్న, నాయకులు మోరే నర్సింగరావు, బాసాని రామకృష్ణ, బెజ్జూరి శ్రీకాంత్, బాగే రాములు, మెంతని శ్రీను, నూశెట్టి లక్ష్మణ్, వంగరి నారాయణస్వామి, మెంతని మల్లయ్య, బీరెల్లి సోషల్ మీడియా వారియర్ గడదాసు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES