- Advertisement -
నవతెలంగాణ-కంటోన్మెంట్
హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి సెంటర్ పాయింట్ వద్ద ఉన్న ఓ కండ్లజోళ్ల దుకాణంలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. కండ్ల అద్దాలు విక్రయించే ”స్పెక్ట్స్ వేర్” అనే దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దుకాణం మొత్తం దట్టమైన పొగ కమ్ముకుపోయి, చుట్టుపక్కల ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. దుకాణంలో ఉన్న కండ్లజోళ్లు, అద్దాలు దగ్ధమయ్యాయి.
- Advertisement -



