- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లోని చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో చిన్నపాటి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సభ ఒకటో అంతస్థు కళామారుతీ హాలులో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో లోపల పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను ఆర్పివేశారు. అయితే ప్రమాదం జరిగిన టైంలో హాలులో కళాకారులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
- Advertisement -