Saturday, July 19, 2025
E-PAPER
Homeక్రైమ్పేపర్‌ ప్లేట్స్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

పేపర్‌ ప్లేట్స్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

- Advertisement -

– హైదరాబాద్‌ సనత్‌నగర్‌లో ఘటన
నవతెలంగాణ- జూబ్లీహిల్స్‌

హైదరాబాద్‌ నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఫతేనగర్‌, జింకలవాడలో పేపర్‌ ప్లేట్స్‌, ధర్మకోల్స్‌ తయారు చేసే ‘డ్యూరో డైన్‌ ఇండిస్టీస్‌’ ఇండిస్టీలో గురువారం ఉదయం 5 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి పరిశ్రమ మొత్తం వ్యాపించాయి. సిబ్బంది వెంటనే అగ్నిమాపక, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. దాంతో ఐదు ఫైర్‌ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని సనత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు, అగ్నిమాపక అధికారులు తెలిపారు. స్వల్పంగా ఆస్తినష్టం జరిగినట్టు చెప్పారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే షార్ట్‌సర్క్యూట్‌ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -