Friday, July 18, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో అగ్ని ప్ర‌మాదం..ముగ్గురు మృతి

ఢిల్లీలో అగ్ని ప్ర‌మాదం..ముగ్గురు మృతి

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఢిల్లీలోని రిథాలా మెట్రోస్టేషన్‌ సమీపంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఒక ప్లాస్టిక్‌, కపడా ప్రింటింగ్‌ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు భారీగా వ్యాపించాయి. స్థానికులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.

ఈ ప్రమాదంలో ప్రింటింగ్‌ కోసం ఉపయోగించే కెమికల్స్‌ పేలడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఫైర్‌ సిబ్బంది వారిని రక్షించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -