పబ్ యాజమాన్యం తప్పిదమే?
ముందుగానే సమాచారం అందిస్తే ఇంత నష్టం జరిగేది కాదు?
నవతెలంగాణ – బంజారా హిల్స్
జూబ్లీ హిల్స్ ప్లాట్ నెంబర్ 1179, రోడ్ నెంబర్ 45/54 లో ఉండే పబ్లో వెల్డింగ్ పనుల్లో జాప్యం గుడిసెల మాదిరి సెటప్లో చిన్న మంటలు అంటుకొని ఒక్కసారిగా పెద్ద ఎత్తున అంటుకున్నాయి. ఇవి కాస్తా గుడిసెలకూ అంటుకొని తీవ్రంగా మారాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని మాపక పంజాగుట్ట అధికారి రమేష్ ఆద్వర్యంలో సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం ఏమి జరగలేదని అధికారులు తెలిపారు. ఆస్థి నష్టం కొంతమేరకు జరిగిందని, పరిశీలన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు.
ఎట్త్యేటి పబ్‌లో అగ్ని ప్రమాదం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



