Monday, January 12, 2026
E-PAPER
Homeఖమ్మంగుంటిమడుగులో అగ్నిప్రమాదం

గుంటిమడుగులో అగ్నిప్రమాదం

- Advertisement -

– నిద్రిస్తున్న సమయంలో చెలరేగిన మంటలు
– ఉన్న ఫలానా బయటకు పరుగులు తీసిన గృహస్తులు
– సర్వం కోల్పోయిన దంపతులు
నవతెలంగాణ – అశ్వారావుపేట

దొంగలు దూరిన ఇళ్ళు, అగ్ని పడ్డ గృహస్తులు సర్వం కోల్పోతారని నానుడి. మండల పరిధిలోని గుంటిమడుగులో శనివారం రాత్రి పదిన్నర సమయంలో బిట్ట వెంకటేశ్వరరావు, సావిత్రి దంపతుల గృహంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు రేగడంతో నిద్రలోనే ఇంటి బయటకు పరుగులు తీసారు. పూరిగుడెస కావడంతో ఇరుగుపొరుగు చేరుకునే లోపే ఇంట్లో ఉన్న సర్వం దగ్దం ఆయ్యాయి.

ఆదివారం సీపీఐ(ఎం) జిల్లా నాయకులు చిరంజీవి ప్రమాద బాధితులను పరామర్శించారు‌. మండల కార్యదర్శి సోడెం ప్రసాద్ ఆద్వర్యం లో గ్రామస్తులు సహకారంతో నిత్యావసర సరుకులు, సామాగ్రి ని తక్షణ సహాయంగా అందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -