- Advertisement -
రసాయన కర్మాగారంలో ఏడుగురు సజీవ దహనం
జైపూర్ : రాజస్తాన్‌లో రసాయన కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు కార్మికులు యూనిట్ లోపల చిక్కుకున్నట్టు అధికారులు సోమ వారం తెలిపారు. బివాండి జిల్లాలోని కురుక్షేత్ర-కరోలి పారిశ్రామిక ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఘటన గురించి తెలుసుకున్నారని, వెంటనే సహాయక చర్యలు చేపట్టారని అదనపు జిల్లా మెజిస్ట్రేట్ సుమితా మిశ్రా తెలిపారు. యూనిట్ లోపల తొమ్మిది మంది చిక్కుకున్నారని, ఇప్పటి వరకు ఏడు మృతదేహాలను బయటకు తీశామని అన్నారు. మిగిలిన ఇద్దరు కార్మికులను రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
- Advertisement -



