షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు, గోడౌన్ దగ్ధం
నవతెలంగాణ-ఝరాసంగం, పటాన్‌చెరు
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు, పరుపుల గోడౌన్ దగ్ధమైన ఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఏడాకులపల్లి గ్రామం, పటాన్‌చెరులో గురువారం జరిగాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడాకులపల్లి గ్రామానికి చెందిన యు.సిద్ధన్న ఇంట్లో కరెంటు షార్ట్ సర్క్యూట్‌తో నిప్పుంటుకుని మంటలు చెలరేగాయి. ఇంట్లోని నిత్యవసర సరుకులతో పాటు విలువైన పట్టు చీరలు, ఫర్నిచర్, లక్షకు పైగా నగదు సైతం కాలి బూడిద అయ్యాయని బాధితుడు తెలిపాడు. ఈ ప్రమాదంలో సుమారు రూ.2.19 లక్షల విలువ ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు.పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లోని తేజా కాలనీలో గురువారం ఉదయం ఎంఎం కాటన్ ట్రేడర్స్ పరుపుల తయారు చేసే గోడౌన్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఆస్తి నష్టం, ప్రమాదానికి గల కారణాలు విచారణ అనంతరం తెలుపుతామని ఎస్‌ఐ వెంకట నాగేంద్ర తెలిపారు.



