Tuesday, February 3, 2026
E-PAPER
Homeక్రైమ్దూరదర్శన్ కేంద్రంలో అగ్ని ప్రమాదం 

దూరదర్శన్ కేంద్రంలో అగ్ని ప్రమాదం 

- Advertisement -

– రెండు 5 నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 
నవతెలంగాణ – కామారెడ్డి 

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న దూరదర్శన్ కేంద్రంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటల 5 నిమిషాలకు అగ్ని ప్రమాదం  చోటు చేసుకుంది. మంటలను చూసిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి కేవలం 5 నిమిషాల్లోనే వాయు వేగంతో చేరుకున్నారు. అప్పుడే మొదలై ఎగిసిపడుతున్న మంటలను వారు అదుపులోనికి తీసుకువచ్చారు.

దీంతో చుట్టుపక్కలలో ఉన్న ఇండ్ల యజమానులు, పక్కనే ఉన్న కట్టెకోత మిషన్ యజమానుల సైతం ఊపిరి పీల్చుకున్నారు. ఈ దూరదర్శన్ రిలే కేంద్రం నివాస గృహాల మధ్య ఉండడం పక్కనే కట్టే కోత మిషన్ ఉండడంతో ఆ మంటలు ఎక్కడ ఎగిసిపడి తమ ఇండ్లకు కట్టెకోత మిషన్లకు వస్తాయని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే పరిసర ప్రాంత ప్రజలు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీంతో స్థానిక ప్రజలు కామారెడ్డి అగ్నిమాపక సిబ్బంది అధికారి అబ్దుల్ సలాం, లేడీ ఫైటర్ సాయిబాబా, సిబ్బంది శ్రవణ్ తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -