Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నివాస గుడిసెకు అగ్ని ప్రమాదం..బాధితుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి 

నివాస గుడిసెకు అగ్ని ప్రమాదం..బాధితుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి 

- Advertisement -

– సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మోతి రామ్ నాయక్ 
నవతెలంగాణ – గాంధారి
: గాంధారి మండలంలోని చర్మల్ గ్రామంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను సీపీఐ(ఎం) పార్టీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మోతి రామ్ నాయక్ మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ వల్ల ఇల్లంతా కాలిపోయి దాదాపు 20 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అన్నారు. ఆ పేద కుటుంబం కనీసం కట్టు బట్టలు కూడా లేకుండా విలవిలలాడుతుందని అన్నారు.

కావున ప్రభుత్వ అధికారులు వెంటనే చొరవ చూపి వెంటనే కావలసిన తిండి బట్టలు ఉండటానికి ఏర్పాట్లు చేయాలని అలాగే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి. అలాగే నిత్యవసరుకులతోపాటు బట్టలు కూడా పంపిణీ చేయాలని ఖర్చులకోసం ప్రస్తుతం రెండు లక్షల వరకు అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే గ్యాస్ సిలిండర్లతో ప్రమాదం జరిగింది. కాబట్టి హెచ్పి గ్యాస్ వాళ్ళు 20 లక్షల వరకు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ప్రభుత్వ అధికారులు హెచ్.పీ గ్యాస్ వాళ్లతో మాట్లాడించి ప్రభుత్వం బాధ్యత చూడాలని అన్నారు గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ప్రకాష్ నాయక్ కూడా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -