Saturday, January 10, 2026
E-PAPER
Homeక్రైమ్సీసీఐ జిన్నింగ్‌ మిల్లులో అగ్నిప్రమాదం

సీసీఐ జిన్నింగ్‌ మిల్లులో అగ్నిప్రమాదం

- Advertisement -

– కాలిన 20 క్వింటాళ్ల పత్తి, మిషనరీ
– భయాందోళనలో వర్కర్లు, రైతులు
నవతెలంగాణ-కారేపల్లి

ఖమ్మం జిల్లా కారేపల్లిలో సీసీఐ కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న శ్రీలక్ష్మి కోటెక్స్‌ జిన్నింగ్‌ మిల్లులో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మిల్లు మిషనరీ నుంచి మంటలు ఎగిసిపడి పత్తికి అంటుకోవడంతో జిన్నింగ్‌ మిల్లు ప్రాంతం దట్టమైన పొగ కమ్మింది. మిల్లులో నిల్వ ఉన్న వేయి క్వింటాల పత్తికి మంటలు అంటుకోవడంతో మిల్లులో పనిచేస్తున్న వర్కర్లు, పత్తి అమ్మటానికి వచ్చిన రైతులు భయాందోళనతో ఉరుకులు పరుగులు పెట్టారు. తేరుకున్న వర్కర్లు, సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈలోపు పైపులతో నీళ్లు కొట్టి మంటలను అదుపులోకి తేచ్చే ప్రయత్నం చేశారు. ఇల్లందు నుంచి ఫైరింజన్‌ కారేపల్లికి చేరుకొని 2 గంటల సేపు కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదం జరిగిన జిన్నింగ్‌ మిల్లును సీసీఐ అధికారి గురురాజ్‌ కులకర్ణి పరిశీలించారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఆయన మిల్లుకు చేరుకొని సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అప్రమత్తం కావటంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. ఆయన వెంట ఏఎంసీ కార్యదర్శి నరేష్‌కుమార్‌ ఉన్నారు.

లిన్డ్‌ క్లీనర్‌లో రాయి రాపిడితో మంటలు : మిల్లు యజమాని రాహుల్‌
జిల్లింగ్‌ మిల్‌ లిన్డ్‌ క్లీనర్‌లో రాయి వంటి వస్తువు రాసుకొని నిప్పు రవ్వలు వచ్చి కన్వేయర్‌ బెల్ట్‌ వద్ద పత్తికి అంటుకోవటంతో ప్రమాదం జరిగి ఉంటుందని మిల్లు యజమాని రాహుల్‌ తెలిపారు. ఈ ప్రమాదంలో 20 క్వింటాళ్ల పత్తి దగ్ధమైనట్టు చెప్పారు. అండర్‌ గ్రౌండ్‌లోని మిషనరీ బెల్టుల వద్ద పొగవస్తుండటంతో పసిగట్టిన సిబ్బంది అదుపు చేయటంతో అక్కడున్న రూ.కోటి విలువైన పత్తిబేళ్లు, పత్తి గింజలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దాంతో యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.

జిన్నింగ్‌ మిల్లును పరిశీలించిన సీసీఐ అధికారి
అగ్నిప్రమాదం జరిగిన జిన్నింగ్‌ మిల్లులు సీసీఐ అధికారి గురురాజ్‌ కులకర్ణి పరిశీలించారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఆయన మిల్లుకు చేరుకోని సంఘటన వివరాలను తెలుకున్నారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సిబ్బంది అప్రమత్తం కావటంతో పెద్దప్రమాదం తప్పిందన్నారు. ఆయన వెంట ఏఎంసీ కార్యదర్శి నరేష్‌కుమార్‌ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -