- Advertisement -
నవతెలంగాణ – చౌడాపూర్
అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగిన ఘటన చౌడాపూర్ మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. దుద్యాలకి చెందిన శివ అనే వ్యక్తి చౌడాపూర్ మీదుగా షాద్నగర్ వైపు వెళ్తున్నాడు. చౌడాపూర్ మండలం విఠలాపూర్ గ్రామ సమీపంలో ఆకస్మికంగా కారులో మంటలు చెలరేగాయి. సమీపంలో శివ స్వాములు ఉండటం, దగ్గర్లో బోర్ ఉండటంతో స్వాములు నీరు తెచ్చి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు.
- Advertisement -



