- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మెహిదీపట్నం బస్టాండ్ వద్ద ఓ ఆర్టీసీ సిటీ బస్సులో మంటలు చెలరేగాయి. మెహిదీపట్నం నుంచి ఉప్పల్ కు వెళ్తున్న ఈ ఆర్డినరీ బస్సులో మంటలు వ్యాపించి బస్సు దగ్ధమైంది. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.
- Advertisement -