- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : శంషాబాద్ లో పిక్నిక్ కు వెళ్తున్న స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. చంపాపేట్ నుండి శంషాబాద్ కు వెళ్తున్న బస్సు శంషాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో బస్సులోని విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవల శంషాబాద్ లోనే మరో స్కూల్ బస్సు బోల్తా పడి పలువురు విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే.
- Advertisement -



