Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుసెవెన్ హిల్స్ ఎక్స్ ప్రెస్ లో మంటలు..

సెవెన్ హిల్స్ ఎక్స్ ప్రెస్ లో మంటలు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తిరుపతి నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఓ రైలులో మంటలు చెలరేగాయి. 127 69 నెంబర్ గల సెవెన్ హిల్స్ రైలు చిగిచెర్ల రైల్వే స్టేషన్ సమీపంలో రైలు చివరి భాగంలో గార్డు భోగి కంటే ముందు భోగి వద్ద బ్రేకులు పడి మంటలు చెలరేగాయి.
దీంతో అందులోని ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు. కేకలు వేస్తూ గార్డుకు, లోకో పైలట్ ను అప్రమత్తం చేయడంతో రైలును నిలిపివేశారు. ప్రయాణికులు బోగీల్లోంచి కిందికి దిగారు. సకాలంలో మంటలు ఆర్పివేశారు రైల్వే సిబ్బంది. అరగంట తర్వాత రైలు సికింద్రాబాద్ కు పయనమైంది. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఘటనపై రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు.
ఓ వైపు రోడ్డు ప్రమాదాలు.. ఓ వైపు విమాన ప్రమాదాలు, మరోవైపు రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad