– ప్రయాణికులు సురక్షితం
– యూపీలో ఘటన..
లక్నో: ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై మరో ప్రయివేటు బస్సులో మంటలు చెలరేగాయి. ఢిల్లీ నుంచి లక్నో మీదుగా గోండా ప్రాంతానికి వెళ్తున్న ఏసీ స్లీపర్ బస్సులో రెవ్రి టోల్ ప్లాజా సమీపంలో ఆదివారం మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 4:45 గంటల ప్రాంతంలో టోల్ ప్లాజాకు 500 మీటర్ల ముందు బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులందరినీ కిందకు దించేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని..మంటలు ఆర్పివేశారు. బస్సులో ఉన్న దాదాపు 39 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మొదట బస్సు చక్రంలో ప్రారంభమైన మంటలు వాహనం లోని మిగిలిన భాగాలకు వ్యాపించినట్టు డ్రైవర్ జగత్ సింగ్ తెలిపాడు. ప్రమాదం విషయం తెలుసుకున్న ప్రయివేటు బస్సు యాజ మాన్యం ప్రయాణికులకు మరోబస్సును ఏర్పాటు చేసింది. బస్సుకు మంటలు అంటుకోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
మరో స్లీపర్ బస్సులో మంటలు
- Advertisement -
- Advertisement -



