22 మంది మృతి… పలువురికి గాయాలు
జకార్తా: ఇండోనేషియా రాజధాని జకార్తాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఏరియల్ సర్వే కోసం ఉపయో గించే డ్రోన్లు తయారు చేసే ఏడంతస్తుల కార్యాలయంలో మంగళవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు మంటల్లో చిక్కుకుని గాయపడినట్టు తెలు స్తోంది. అగ్నికీలలు సమీపంలోని భవనాలకూ వ్యాపించడంతో అక్కడి ప్రజలను ఇండ్లు ఖాళీ చేయించి.. సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. కార్యాలయ భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న గోదాంలోని బ్యాటరీ పేలడంతో ఈ మంటలు చెలరేగినట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. మంటలు పైఅంతస్తులకు వ్యాపించడంతో భవనంలో అనేక మంది చిక్కుకున్నారని.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నామని తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక బృందాలు మంటలు ఆర్పడానికి శ్రమిస్తున్నాయన్నారు.
ఇండోనేషియాలో అగ్నిప్రమాదం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



