Tuesday, December 30, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇండోనేసియాలో అగ్నిప్రమాదం.. 17 మంది మృతి

ఇండోనేసియాలో అగ్నిప్రమాదం.. 17 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇండోనేసియాలోని ఒక ఏడంతస్తుల కార్యాలయ భవనంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది పలు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారని మీడియా కథనాలు తెలుపుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. మంటలు అదుపులోకి వచ్చాయని, భవనం లోపల మరికొందరు బాధితులు ఉండవచ్చని, వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని సెంట్రల్ జకార్తా పోలీస్ చీఫ్ తెలిపారు. మధ్యాహ్నం సమయంలో మొదటి అంతస్తులో మంటలు చెలరేగి, ఆపై పై అంతస్తులకు వ్యాపించాయని ఆయన వెల్లడించారు. ఆ సమయంలో కొంతమంది ఉద్యోగులు భవనంలో భోజనం చేస్తుండగా, మరికొందరు కార్యాలయం నుంచి బయటకు వెళ్లారని సమాచారం. మంటల్లో చిక్కుకుపోయిన బాధితులను సురక్షితంగా బయటకు తీసుకురావడంపై దృష్టి సారించామని అధికారులు తెలిపారు. ఈ భవనంలో టెర్రా డ్రోన్ ఇండోనేషియా కార్యాలయం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -