Tuesday, September 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్టీసీ బస్సులో మంటలు

ఆర్టీసీ బస్సులో మంటలు

- Advertisement -

– ప్రయాణికులు సురక్షితం

నవతెలంగాణ-మెహిదీపట్నం
హైదరాబాద్‌ మెహిదీపట్నం బస్టాండ్‌లో మంగళవారం ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు ముందు భాగం దగ్ధమైంది. అప్పటికే ప్రయాణికులంతా దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకెళ్తే.. మెహిదీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు లింగంపల్లి నుంచి మెహిదీపట్నం వచ్చింది. అదే సమయంలో బస్సు ఒక్కసారిగా ఆగిపోయింది. దాంతో డ్రైవర్‌ రోడ్డు పక్కన నిలిపివేశాడు. సెల్ఫ్‌ స్టార్ట్‌ చేసేందుకు ప్రయత్నించగా స్టార్ట్‌ కాలేదు. ఈ క్రమంలో ప్రయా ణికులందరూ కిందకు దిగిపోయారు. ఆ తరువాత డ్రైవర్‌ బానెట్‌ ఓపెన్‌ చేసి కేబుల్స్‌ సరి చేసే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ఇంజిన్‌ భాగంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. అప్పటికే బస్సు ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. ఆర్టీసీ అధికారులు బస్సును పరిశీలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -