- Advertisement -
నవతెలంగాణ – ఆలేర్ రూరల్
ఆలేరు మండలం కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అగ్నిమాపక శాఖ అధికారి బాబు మల్లేష్ ఆధ్వర్యంలో అగ్నిమాపక భద్రతపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,అగ్నిమాపక పరికరాల వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు చేయాల్సిన చర్యలపై ఆయన విద్యార్థులకు ప్రత్యేకంగా సూచనలు ఇచ్చారు. అగ్నిమాపక భద్రత పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాల్సిన అవసరాన్ని అధికారులు ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



