Sunday, March 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యుద్ఘాతంతో టపాకాయల లారీ దగ్ధం

విద్యుద్ఘాతంతో టపాకాయల లారీ దగ్ధం

- Advertisement -

రంగారెడ్డి జిల్లా కొత్తూరు వద్ద ఘటన
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ
నవతెలంగాణ- కొత్తూరు

టపాకాయలతో వెళ్తున్న లారీకి విద్యుత్‌ తీగలు తగలడంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పెంజర్ల రెవెన్యూ పరిధిలో శనివారం జరిగింది. సీఐ నరసయ్య తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం శివకాశి నుంచి టపాకాయల లోడ్‌తో లారీ రంగారెడ్డి జిల్లా మహేశ్వరంతోపాటు నిజామాబాద్‌ జిల్లాలో అన్‌లోడ్‌ చేసేందుకు వెళ్తోంది. ఈ క్రమంలో పెంజర్ల నుంచి మాణిక్యంగూడ రోడ్డులో వెళ్తుండగా లారీకి విద్యుత్‌ తీగలు తగిలి మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫైర్‌ ఇంజన్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు. టపాకాయలు ఉండటంతో మంటల తీవ్రత ఎక్కువగా ఉండి లారీ పూర్తిగా దగ్ధమైంది. విద్యుత్‌ అధికారులు సైతం ఘటనా స్థలికి చేరుకుని పరిశీలిం చారు. అలాగే ఘటనా స్థలాన్ని డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ పరిశీలించి, ప్రమాదంపై ఆరా తీశారు. లారీ డ్రైవర్లు అయ్యప్పన్‌, సత్తి వెల్‌ క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -