Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టపాకాయల దుకాణదారులు పోలీసుల అనుమతి తీసుకోవాలి

టపాకాయల దుకాణదారులు పోలీసుల అనుమతి తీసుకోవాలి

- Advertisement -

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల దుకాణాదారులు తప్పకుండా సంబంధిత డివిజినల్ స్థాయి పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలి అని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. దీపావళి పండుగ సందర్బంగా నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు నెలకొల్పేవారు వారి వారి సంబంధిత డివిజినల్ పోలీస్ అధికారి కార్యాలయం నుండి ధరఖాస్తు చేసుకొని అనుమతి పొందగలరు. దానికి సంబంధించిన ఇతర సమాచారం కోసం సంబంధిత డివిజినల్ స్థాయి అధికారిని సంప్రదించగలరు. ఎవ్వరయిన సంబంధిత డివిజినల్ పోలీస్ అధికారి నుండి అనుమతి లేకుండా టపాకాయల దుకాణాలను నెలకొల్పినట్లయితే వారిపై ఎక్స్ ప్లోజివ్ యాక్టు – 1884 రూల్స్ 1933 సవరణ 2008 ప్రకారంగా కఠిన చర్యలు తీసుకొనబడును అని తెలియజేశారు.

టపాకాయల దుకాణాదారులు తప్పక పోలీసు నిబంధనలు పాటించాలి. టపాకాయల దుకాణాలు సంబందిత ఖాళీ ప్రదేశాలలో నెలకొల్పవలెను. ఖాళీ ప్రదేశానికి సంబంధించిన ఎన్.ఓ.సి సర్టిఫికేటు పొందపర్చాలి. ఒక క్లస్టర్లో 50 షాపులకు మించరాదు.జనరద్దీగల ప్రదేశాలలో ఎలాంటి టపాకాయల షాపుల ఏర్పాటు చేయరాదు. అదేవిధంగా కళ్యాణ మండపాలలో మరియు సమావేశాల కేంద్రాలలో టపాకాయల దుకాణాలు నెలకొల్పరాదు.తాత్కాలిక టపాకాయల దుకాణాలలో ఫైర్ కు సంబంధించిన జాగ్రత్తలు తప్పక పాటించేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తివివరాలతో కూడిన దరఖాస్తు ఫారంను సంబంధిత ఎ.సి.పి కార్యాలయంలో ఇవ్వగలరు అని తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -