Thursday, October 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అచ్చంపేటలో విచ్చలవిడిగా బాణాసంచాలు నిల్వలు

అచ్చంపేటలో విచ్చలవిడిగా బాణాసంచాలు నిల్వలు

- Advertisement -

– అనుమతులు లేకుండా అధిక ధరలకు అమ్మకాలు 
–  సామాన్యులపై భారం పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-అచ్చంపేట : దీపావళి పండుగ సమీపిస్తుంది. టపాసుల వ్యాపారులు పట్టణంలో విచ్చలవిడిగా అక్రమంగా నిల్వలు ఉంచారు. అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అధిక ధరలకు అమ్ముతున్నారు. సామాన్య పల్లె ప్రజలపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని ప్రధాన రహదారి వెంట విచ్చలవిడిగా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బట్టల షాపులలో, కిరాణం షాపులలో, ఇతర దుకాణాలలో పేలుడు టపాసులు విక్రయిస్తున్నారు. ఇండ్ల మధ్యలో నిల్వ చేశారు. దీపావళి పండుగ అంటేనే పెద్దలు చిన్నలు అందరూ సంతోషంగా గడుపుతారు. అచ్చంపేటలో దసరా నుంచే టపాసులు అమ్మకాలు జరుగుతున్నాయి.దీపావళి పండుగ సమీపిస్తున్నంతో వ్యాపారులు టపాసులు నిలువలు పెంచుతున్నారు. జనంలోనే టపాసుల దందా నడిపిస్తున్నారు.
ఎలాంటి ప్రమాదాలు జరగకుండా  అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీలు చేసి కట్టడి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని పట్టణ ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. టపాసుల వ్యాపారులు హైదరాబాద్ నుండి బాణ సంచాలు పెద్ద మొత్తంలో తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సేల్స్ టాక్స్ అధికారులతో పాటు జీఎస్టీ అధికారులు అధికారులు తనిఖీలు చేయవలసిన అవసరం. ఎక్కడ కొనుగోలు చేశారు సంబంధించిన బిల్లులు పరిశీలించాల్సిన అవసరం ఉంది.

 దీపావళి పండుగ సందర్భంగా పేల్చే బాణ సంచాల వల్ల గాలి కాలుష్యం ఏర్పడుతుందని పర్యావరణానికి పెద్ద ముప్పు ఏర్పడుతుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే తుపాకులు పేల్చడం వల్ల చిన్నపిల్లలలో వీనికిడి లోపం ఏర్పడుతుంది.గుండె కు సంబంధించిన వ్యాధిలకు లోనియ్యే  ప్రమాదం ఉంటుంది. పెద్ద శబ్దాల వల్ల రక్తపోటు పెరగడంతో పాటు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

 కన్నయ్య రైస్ మిల్ ఆవరణలో మాత్రమే బాణ సంచాలు విక్రయించాలని అగ్నిమాపక అధికారులు సూచించారు.  దుకాణానికి దుకాణానికి మధ్య మూడు మీటర్లు దూరం ఉండాలని, ప్రతి దుకాణం ముందు డ్రమ్మునిండా నీళ్లు ఉంచుకోవాలని, బకెట్లో ఇసుక నింపి ఉంచుకోవాలని, పెట్రోల్, అయిల్స్ , సిగరెట్లు, కరెంట్ తీగలు దగ్గర లేకుండా చూసుకోవాలని  అధికారులు సూచిస్తున్నారు.

బాణసంచా విక్రయాలకు అనుమతులు తీసుకోవాలి స్టేషన్ ఫైర్ ఆఫీసర్:  శంకర్
 దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా విక్రయాలకు వ్యాపారులు తప్పకుండా అనుమతులు తీసుకోవాలి. అచ్చంపేటలో 11 మందికి అనుమతులు తీసుకున్నారు.  అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించాలి. దుకాణాల ముందు అగ్నిమాపక బకెట్లు అందుబాటులో ఉంచాలి. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే 101 కు సమాచారం ఇవ్వాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -