Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeజాతీయంభారత్‌, పాక్‌ దళాల మధ్య కాల్పులు

భారత్‌, పాక్‌ దళాల మధ్య కాల్పులు

- Advertisement -

– చొరబాటు యత్నం భగం
– ఒక సైనికుడు మృతి
శ్రీనగర్‌ :
జమ్ముకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉరి వద్ద నియంత్రణ రేఖ సమీపంలో ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వ్యక్తులు దేశంలోకి చొరబాటుకు చేసిన యత్నాన్ని భారత్‌ సైన్యం తిప్పికొట్టింది.
అయితే ఈ ప్రయత్నంలో ఒక భారత సైనికుడు మృతి చెందాడు. మృతి చెందిన సైనికుడ్ని చినార్‌ క్రాప్స్‌కు చెందిన హవిల్దర్‌ అంకిత్‌ కుమార్‌గా గుర్తించారు. బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. కొందరు పాకిస్తానీ చొరబాటుదారులు భారత్‌లోకి ప్రవేశించడానికి యత్నించారు. భారత సైన్యం వారిని అడ్డుకుంటుండగా.. చొరబాటుదారులు కాల్పలు జరిపారు. చొరబాటుదారులు పారి పోయినట్లు అధికారులు తెలిపారు. తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పారు. కాగా, ఇదే ప్రాంతంలో రెండు రోజుల క్రితం ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం కాల్చిచంపింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad