రియాజ్ ఎన్కౌంటర్ పై స్పందించిన సీపీ సాయి చైతన్య
నవతెలంగాణ – కంఠేశ్వర్
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్( ఎన్‌కౌంటర్‌లో హతమైన విషయం తెలిసిందే. అయితే.. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం రియాజ్‌ను చేర్పించిన పోలీసులు ఎందుకు ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చిందో సీపీ సాయి చైతన్య వెల్లడించారు. ఆస్పత్రిలో ఖైదీ వార్డులో ( ఐసో లేషన్ వార్డు) లో చికిత్స పొందుతున్న సమయంలో రియాజ్ ముందుగా హస్పీటల్ అద్దాలను ధ్వంసం చేశాడు. సౌండ్ గమనించిన అదే సమయంలో రెగ్యూలర్ తనిఖీలలో బాగంగా ఎఆర్ పోలీసులు ప్రిజనరీ వార్డును తనిఖీ చేసేందుకు వచ్చారు.
అప్పుడు అక్కడికి చేరుకున్న రిజర్వ్ సిబ్బంది రియాజ్ ను వారించారు. కాని వారిని పట్టించుకోకుండా ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీని లాక్కున్నాడు. తుపాకిని పారేయాలని పోలీసులు చెబుతున్న వినకుండా తుపాకీ తో కాల్చేందుకు ( ట్రిగ్గర్ నొక్కేందుకు) ప్రయత్నించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏ ఆర్ ఎస్ ఐ ఆత్మ రక్షణార్థం జరిగిన కాల్పులలో రియాజ్ ఖతం అయ్యాడు అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.
ఆదివారం మధ్యాహ్నం జిల్లా జనరల్ ఆస్పత్రిలో జరిగిన రియాజ్ ఎన్ కౌంటర్ పై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ.. తప్పనిసరి పరిస్థితులలోనే కాల్పులు జరపడం జరిగిందని, అందులోనే రియాజ్ హతం అయ్యారని అన్నారు. రియాజ్ కిందపడి తిరిగి లేవలేదని తెలిపారు. ఇందుకు సంబంధించిన కేసు నమోదు చేయడం జరుగుతుందని, దీనిపై విచారణ జరుపుతామని తెలిపారు. రియాజ్ ఎన్ కౌంటర్ కు గల కారణాలు విచారణలో తేలుతాయని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు డిసీపీ బస్వారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తప్పనిసరి పరిస్థితులలో కాల్పులు జరపాల్సి వచ్చింది: సీపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES