నవతెలంగాణ – హైదరాబాద్
ప్రపంచంలోనే తొలి అటానమస్ యాంటీ డ్రోన్ గస్తీ వాహనాన్ని ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ ఇండియా ఆవిష్కరించింది. దీనిని బుధవారం హైదరాబాద్‌లో రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర ప్రతాప్ పాండే విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ”భవిష్యత్‌లో దేశాల మధ్య యుద్ధాలు.. కేవలం ఆయుధాలతో మాత్రమే ఉండవు. దేశంలోకి శత్రు దేశాలు పలుమార్లు పంపిన డ్రోన్లను మన బలగాలు నిర్వీర్యం చేస్తున్నాయి. ఇంద్రజాల్ రేంజర్ అనే వాహనం అలాంటి అనుమానాస్పద డ్రోన్లను కూల్చుతుంది. ఇది చాలా కీలకమైన ముందడుగు.” అని పేర్కొన్నారు. ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ ఇండియా సీఈఓ కిరణ్ రాజు మాట్లాడుతూ.. 26/11 దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించేందుకే ఈ రోజున దీనిని ఆవిష్కరించా మన్నారు. భారత్‌కు ఇతర దేశాలతో భూ సరిహద్దు 15 వేల కిలోమీటర్లు ఉంది. డ్రగ్స్ ట్రాఫికింగ్ పెద్ద సమస్యగా మారింది. ఆ సమస్య నుంచి పుట్టిందే ఇంద్రజాల్ రేంజర్ వాహనమన్నారు. ఈ వాహనం 10 కిలోమీటర్ల రేడియస్‌లో పని చేస్తుందన్నారు.
తొలి అటానమస్ యాంటీ డ్రోన్ గస్తీ వాహనం ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -



