Saturday, February 28, 2026
E-PAPER
Homeజాతీయందేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ

దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ

- Advertisement -

కోజికోడ్‌లో ప్రారంభించిన కేరళ సీఎం పినరయి విజయన్‌
కేఐఐఎఫ్‌బీ నిధులు రూ. 643.88 కోట్ల అంచనా వ్యయంతో అమలు
సామాన్యులకు అందుబాటులోకి శస్త్రచికిత్సలు
ప్రయివేట్‌ రంగంలో రూ.లక్షల్లో ఖర్చు

తిరువనంతపురం: ఆరోగ్య సంరక్షణ రంగంలో కేరళ ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోందని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అన్నారు. కోజికోడ్‌లోని చెవయూర్‌లో దేశంలోనే మొట్టమొదటి సమగ్ర అవయవ మార్పిడి సంస్థకు శంకుస్థాపన చేశారు. ఈ సంస్థ ప్రపంచంలోనే మూడవ సమీకృత చికిత్స పరిశోధనా కేంద్రం కూడా. అలాగే దేశంలోనే ఈ తరహాలో మొదటిది. కేఐఐఎఫ్‌బీ నిధులతో సుమారు రూ. 643.88 కోట్ల అంచనా వ్యయంతో అమలు చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ఎల్డీఎఫ్‌ అవయవ మార్పిడికి సంబంధించిన అన్ని సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అవయవ వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు ఈ సంస్థ ప్రాథమిక నిర్ధారణ, అధునాతన శస్త్రచికిత్సల నుంచి పోస్ట్‌-ట్రాన్స్‌ప్లాంట్‌ ఫాలో-అప్‌ , పునరావాసం వరకు పూర్తి స్థాయి సంరక్షణను అందించనున్నది. క్లినికల్‌ సేవలతో పాటు, అవయవ మార్పిడి రంగంలో పరిశోధన, బోధన, వైద్య నిపుణుల శిక్షణపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నది.ప్రయివేట్‌ రంగంలో లక్షల రూపాయలు ఖర్చయ్యే అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను సాధారణ ప్రజలకు, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అందుబాటులోకి తీసుకురావడం ఈ ప్రాజెక్ట్‌ యొక్క ముఖ్య లక్ష్యాలలో ఒకటి. చెవయూర్‌లోని 20ఎకరాల స్థలంలో ఈ సంస్థ నిర్మాణం ప్రారంభమైంది. 30 నెలల్లో ఈ సదుపాయాన్ని పూర్తి చేసి, అందు బాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ సంస్థ కార్యక లాపాలు ప్రారంభమైన తర్వాత, అవయవ మార్పిడి ప్రక్రియల కోసం ప్రయివేట్‌ ఆస్పత్రులు , విదేశాలపై కేరళ ఆధార పడటాన్ని ఇది గణనీయంగా తగ్గించ నున్నది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ పంపిణీలో ఇదొక కొత్త శకానికి నాంది పలుకుతుందని భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -