నవతెలంగాణ – తుంగతుర్తి
ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు(సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1) ప్రశాంతంగా ముగిసినట్లు ఆయా కేంద్రాల సి ఎస్,డి ఓ లు వెల్లడించారు. బుధవారం జరిగిన పరీక్షకు తుంగతుర్తి మండల వ్యాప్తంగా 486 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా,464 మంది హాజరయ్యారు.22 మంది విద్యార్థులు హాజరు కాలేదు. తుంగతుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి 240 మంది విద్యార్థులకు 237 హాజరు కాక ముగ్గురు విద్యార్థులు ఆబ్సెంట్ అయినట్లు తెలిపారు. గిరిజన బాలికల కళాశాల నుండి 246 మంది విద్యార్థులకు గాను 227 మంది విద్యార్థులు హాజరు కాక 19 విద్యార్థులు ఆబ్సెంట్ అయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సి ఎస్ లు మధుకర్,అరుణ డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు ఉపేందర్,నరేందర్ లు తదితరులు పాల్గొన్నారు.
తొలిరోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



