Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు..!

ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు..!

- Advertisement -
  • – కిటకిటలాడనున్న ఆలయాలు
  • నవతెలంగాణ – మల్హర్ రావు
  • తొలి ఏకాదశి పండగను పురస్కరించుకుని ఆదివారం ప్రజలు భక్తిశ్రద్ధలతో ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.మండలంలోని పెద్దతూoడ్ల గ్రామంలోని శ్రీహనుమత్సహిత రాజరాజేశ్వర పంచాయతన ఆలయంతోపాటు పలు ఆలయాల్లో సందర్శకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయాలు సందర్శకులతో కిటకిటలాడాయి. ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు.సంవత్సరం మొత్తంలో 24 ఏకాదశులు ప్రతినెల కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి మొత్తం రెండు ఏకాదశులు వస్తాయి. ఆదివారం తొలి ఏకాదశి పండగ నుంచే చాతు ర్మాస్య వ్రతాలు ప్రారంభమైయ్యాయి.ఆషాఢ శుక్ల పక్షం నుంచి కార్తీక శుక్లపక్షం వరకు చాతుర్మాస్య దీక్షలు చేయడం అనవాయితీగా వస్తుంది. తొలి ఏకాదశి ఆదివారం శ్రీమహావిష్ణువు యోగా నిద్రకు ఉపక్రమిస్తూ దీన్ని శయన ఏకాదశి అని పిలుస్తారు.నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి మేల్కొంటారు. ఈ నాలుగు నెలల కాలాన్ని ప్రజలు పవిత్ర నెలలుగా భావించి చాతు ర్మాస్య దీక్షలు చేస్తారు.
  • పండగ విశిష్టత..
  • భక్తులు సూర్యోదయానికి ముందే గోదావరినదిలో స్నానాలు అచరించి మహావిష్ణువు ఆలయాలను సందర్శించి పూజలు చేస్తారు. చాతుర్మాసం ప్రారంభం కానుండడంతో శ్రీ మహావిష్ణువు ఆలయాలు కిటకిటలాడాయి. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి తర్వాత రోజు మహావిష్ణువును పూజించి నైవేద్యం సమర్పించి భోజనం చేస్తారు.
    వ్రతాలు ఆచరించాలి
  • తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతాలు ఆచరించాలి. శ్రీమహావిష్ణువు యోగా నిద్రకు ఉపక్రమిం చే రోజు కావడంతో తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేసి మహావిష్ణువు పూజిస్తే అష్టశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రగాఢ నసమ్మకం.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad