Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంతొలిసారిగా చైనాలో హ్యూమనాయిడ్‌ రోబోట్‌ వరల్డ్‌ గేమ్స్‌

తొలిసారిగా చైనాలో హ్యూమనాయిడ్‌ రోబోట్‌ వరల్డ్‌ గేమ్స్‌

- Advertisement -


16 దేశాల నుంచి 280 జట్లు
బాక్సింగ్‌, పుట్‌బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌, రన్నింగ్‌ రేసుల్లో పాల్గొన్న చిట్టీలు
బీజింగ్‌:
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన రోబో సినిమాలో చిట్టీ చేసిన విన్యాసాలు చూసి మనమంతా ఆశ్చర్యానికి, ఆనందానికి గురై ఉంటాం. లేదా అది సినిమా కాదా అని సరిపెట్టుకుని ఉండిఉంటాం. అయితే అంతకు మించి అద్భుతం చైనాలో చోటు చేసుకుంది. చైనాలోని బీజింగ్‌లో తొలిసారిగా హ్యూమనాయిడ్‌ రోబోట్‌ వరల్డ్‌ గేమ్స్‌ ప్రారంభమయ్యాయి. ఇక్కడ రోబోలు బాక్సింగ్‌, ఫుట్‌బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌, రన్నింగ్‌ రేసు, కుంగ్‌ ఫూ, డ్యాన్స్‌, ఔషధాలు వేరు చేయడం.. వంటి పోటీల్లో పాల్గొన్నాయి. ఈ పోటీల్లో కొన్నిసార్లు ఒకదానికొకటి ఢకొీని కొన్ని రోబోలు కిందపడిపోయినా, పోటీలు ఆసక్తికరంగా సాగాయి. ప్రేక్షకులు సంతోషంతో చప్పట్లు కొట్టారు. ఈ గేమ్స్‌లో 16దేశాల నుంచి 280 జట్లు పాల్గొంటున్నాయి. 26 ఈవెంట్‌ల్లో 500కంటే ఎక్కువ పతకాల కోసం పోటీపడ్డాయి. 1500 మీటర్ల రన్నింగ్‌ రేసును ఒక రోబో 6నిమిషాల 29:37సెకన్లలో పూర్తి చేసింది. ఇది మానవ రికార్డుకు (3 నిమిషాల 26 సెకన్లు) చాలా దూరంలో ఉంది. అయినా ఒక రోబో ఇలా పరుగు పందెం పూర్తి చేయడం అందర్నీ ఆకట్టుకుంది. ఫుట్‌బాల్‌ విభాగంలో చైనా జట్ల నైపుణ్యం చూసి తాను ఆశ్చర్యపోయాయని డచ్‌ నుంచి జూస్ట్‌ వీర్‌హీమ్‌ తెలిపారు. ఈ రోబోటిక్‌ రంగంలో వారు (చైనా) చాలా వేగంగా ప్రపంచ నాయకత్వ స్థాయికి చేరుకుంటారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. మూడు రోజుల పాటు ఈ పోటీలు జరగ నున్నాయి. 2022 వింటర్‌ ఒలింపిక్స్‌ కోసం నిర్మించిన నేషనల్‌ స్పీడ్‌ స్కేటింగ్‌ ఓవరల్‌లో ఈ పోటీలు జరుగుతున్నాయి. 22 డాలర్ల నుంచి 80 డాలర్ల వరకూ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి.

కృత్రిమ మేధస్సుతో నడిచే రోబోట్‌లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి చైనా తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో ఈ గేమ్స్‌ ప్రారంభమయ్యాయి. ఈ సాంకేతిక రంగంలో చైనా తన సామర్థ్యాన్ని, ప్రపంచ పోటీతత్వాన్ని ప్రపంచానికి ప్రదర్శించాలనుకుంటుంది. రోబోటిక్స్‌, ఎఐ వంటి సాంకేతిక స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడానికి చైనా ఈ ఏడాది మార్చిలో ఒక ట్రిలియన్‌ యువాన్ల (సుమారు 119 బిలియన్‌ డాలర్లు) ప్రణాళికలను ప్రకటించింది. అలాగే రోబోటిక్స్‌ ఈవెంట్స్‌ను నిర్వహిం చడం చైనాకు ఇదే మొదటిసారి కాదు. గత కొన్ని నెలల క్రితమే ప్రపంచం లో మొట్టమొదటిసారిగా హ్యుమనాయిడ్‌ రోబోట్‌ మారధాన్‌, రోబోట్‌ కాన్ఫరెన్స్‌, హ్యుమనాయిడ్‌ రోబోట్ల కోసమే ఉద్దేశించిన రిటైల్‌ స్టోర్స్‌ను ప్రారంభించడం.. వంటివి నిర్వహించడం చేసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad