నవతెలంగాణ – నసురుల్లాబాద్
ప్రజాస్వామ్య పై అవగాహన కోసం శాసనసభలో జరిగే విధానాలు, చట్టాల రూపకల్పన, చర్చల సరళిని విద్యార్థులు ప్రత్యక్షంగా అవగాహన కలిగించేందుకు ఏర్పాటు చేసిన మాక్ అసెంబ్లీ అందర్నీ ఆకట్టుకుంది. నస్రుల్లాబాద్ మండలం నేమిలి గ్రామంలో గ్లోబల్ స్పార్క ఉన్నత పాఠశాలలో చదువుకొని విద్యార్థులు మాకు అసెంబ్లీ కార్యక్రమం ప్రజలకు ఎంతో ఆకట్టుకుంది. గురువారం నసురుల్లాబాద్ మండలం నెమ్లి గ్లోబల్ స్పార్క్ హై స్కూల్లో మాక్ అసెంబ్లీ కార్యక్రమంమాకా నిర్వహించారు. ఇందులో తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో అధికార ప్రతిపక్ష నాయకులు ఏ విధంగా చర్చించుకుంటారు.
అనేదానిపై మాక్ అసెంబ్లీ అనే కార్యక్రమం నిర్వహించారు ఇందులో అధికారపక్ష, ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు అసెంబ్లీలో సమస్యలు ఎలా ప్రస్తావిస్తారో.. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాలు, మంత్రుల వివరణలు, స్పీకర్ సభను నడిపించే తీరును కళ్లకు కట్టినట్లు చూపించారు. రాష్ట్రంలో అమలయ్యే చట్టాల రూపకల్పనలో సభ్యుల పాత్రలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా పిల్లలకు అర్థమయ్యేలా వివరించారు. చిన్న చిన్న పిల్లలు అసెంబ్లీ కార్యక్రమంలో చట్టాలపై మాట్లాడుతుంటే తల్లిదండ్రులు ఆనందంతో ఉప్పెంగిపోయారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడి దానికి, అధికార పార్టీ మంత్రులు సమాధానం ఇవ్వడం దానికి కౌంటర్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం విద్యార్థులకు విద్యార్థులు తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఇందులో సీఎం, స్పీకర్, ప్రతిపక్ష, ఎమ్మెల్యేలు ప్రసంగించే తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బాలరాజ్ గౌడ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.



