- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 19.58 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉపాధి కోసం నగరాలు, పట్టణాల్లో ఉన్న ఓటర్లు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
- Advertisement -



