Saturday, May 24, 2025
Homeతెలంగాణ రౌండప్తెలంగాణలోనే గురుకులంలో మొదటి స్థానం..

తెలంగాణలోనే గురుకులంలో మొదటి స్థానం..

- Advertisement -

నవతెలంగాణ – నిజాంసాగర్: మండలంలోని గొర్గల్ గ్రామానికి చెందిన విద్యార్థి మంగ నీరంజన్ ఆరవ తరగతి గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలో 100 మార్కులకు 95 మార్కులు సాధించి తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని సాధించడం జరిగిందని ఎంఈఓ తిరుపతిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని శ్రీ సాయి హై స్కూల్ లో విద్యను అభ్యసిస్తున్న నిరంజన్ మే 12న జరిగిన మల్కాజ్ గిరి సైన్ ఆర్ట్స్ గురుకుల విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలలో 210మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. అందులో విద్యార్థి నిరంజన్  1-10 స్క్రీనింగ్ టెస్ట్ లో 95 మార్కులతో సత్తా చాటి టాపర్ గా నిలిచాడని ఆయన తెలిపారు.

విద్యార్థి నిరంజన్ కు ఉమ్మడి మండలాల విద్యాశాఖ అధికారులు విద్యార్థిని ఘనంగా సన్మానించి  మేమెంట్ అందించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ భార్గవ్, మహమ్మద్ నగర్ మండల విద్యాశాఖ అధికారి అమర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -