Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాలలో మత్స్యకార దినోత్సవ వేడుకలు జరపాలి 

గ్రామాలలో మత్స్యకార దినోత్సవ వేడుకలు జరపాలి 

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ ఉమ్మడి మండలంలో గ్రామ గ్రామాన ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని ముదిరాజ్ సంఘం నియోజకవర్గ ఇన్చార్జి చొప్పరి శ్రీనివాస్ ముదిరాజు అన్నారు. గురువారం హుస్నాబాద్ లో ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు పొన్నబోయిన శ్రీనివాస్  ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా  తెలంగాణ ముదిరాజ్ మహాసభ 11 వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  గౌరవ అధ్యక్షులు పెండ్యాల ఐలయ్య,  పొన్నం మల్లయ్య, అక్కన్నపేట సొసైటీ, మండల అధ్యక్షులు గంగాధరి రాజయ్య, కాశబోయిన యాదగిరి పొట్లపల్లి అధ్యక్షులు బోడ శంకర్,  కార్యదర్శి రాగుల శీను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -