నవతెలంగాణ – గంగాధర : చేపల వేట నిండు ప్రాణాన్ని బలిగొంది. వివరాలలోకి వెళితే.. రామడుగు మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ (28) అనే యువకుడు వరద కాల్వలో గాలాలు వేస్తూ చేపలు పట్టడం అలవాటు. అయితే అదే అలవాటు ప్రకారం ఆదివారం సాయంత్రం ఇర్ఫాన్ గంగాధర మండలం కొండన్నపల్లి వరద కాల్వలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి వరద కాల్వ నీటిలో పడ్డాడు. దీంతో ఇర్ఫాన్ నీటిలో మునిగి ప్రాణం వదిలాడు. ఇతరత్ర పనులు చేసుకుంటూ జీవనం సాగించే ఇర్ఫాన్ వరద కాల్వలో సరదాగా గాలాలు వేస్తూ సాగించే చేపల వేటే చివరికి తన నిండు ప్రాణాన్ని కబళించడం మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుడి సోదరుడు ఇమ్రాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంగాధర ఎస్సై వంశీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
ప్రాణం తీసిన చేపల వేట..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES