Wednesday, April 8, 2026
E-PAPER
Homeక్రైమ్వేర్వేరు కేసుల్లో ఐదుగురు నిందితుల అరెస్ట్‌

వేర్వేరు కేసుల్లో ఐదుగురు నిందితుల అరెస్ట్‌

- Advertisement -

– రూ.63లక్షల మాదక ద్రవ్యాలు స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మూడు వేర్వేరు డ్రగ్స్‌ కేసుల్లో ఐదుగురిని ‘హెచ్‌-న్యూ’, స్థానిక పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ సప్లయర్‌తోపాటు లోకల్‌ డ్రగ్స్‌ సరఫరాదారు, ముగ్గురు డ్రగ్స్‌ సబ్‌డీలర్స్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి ఏండీఏంఏ 115గ్రాములు, హాష్‌ఆయిల్‌ 1005గ్రాములు, ఇ.పిల్స్‌ 363 గ్రాములను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.63,65,500 ఉంటుందని పోలీసులు తెలిపారు. మంగళవారం బషీర్‌బాగ్‌లోని పాత సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీసీపీ వైభవ్‌ గ్వైయికాడ్‌ వివరాలు వెళ్లడించారు. మొదటి కేసులో సనత్‌నగర్‌కు చెందిన సాయి నిఖిల్‌ యాదవ్‌ (సబ్‌పెడిలర్‌)ను పోలీసులు అరెస్టు చేశారు. రెండో కేసులో శ్రీకాకులానికి చెందిన సింహాచలం, కూకట్‌పల్లికి చెందిన వేణు అనే సబ్‌ డీలర్‌ను సనత్‌నగర్‌ పోలీసులతో కలిసి హెచ్‌-న్యూ పోలీసులు అరెస్టు చేశారు. మూడో కేసులో అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన అక్షరుపటేల్‌తోపాటు ఎల్బీనగర్‌కు చెందిన బి.ఆదిత్యావర్థన్‌ను అరెస్టు చేశారు. వీరు సబ్‌పెడ్లర్‌గా వ్యవహరిస్తున్నారు. పక్కా సమాచారంతో ఆదిబట్ల పోలీసులతో కలిసి హెచ్‌-న్యూ పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై గతంలో మూడు కమిషనరేట్ల పరిధిల్లో కేసులున్నాయని డీసీపీ తెలిపారు. ముందుగా డ్రగ్స్‌ అలవాటు చేసుకుంటున్న నిందితులు ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో డ్రగ్స్‌ సరఫరాదారులుగా మారుతున్నారని చెప్పారు. ఈ రాకెట్‌లో మరో 13 నుంచి 15 మంది వినియోగ దారులున్నట్టు గుర్తించామని త్వరలో వారిపై చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు. చాకచక్యంగా డ్రగ్స్‌ సరఫరాదారులను అరెస్టు చేసినందుకు హెచ్‌-న్యూ ఇన్‌స్పెక్టర్లు బి.వెంకట్‌, ఎస్‌.బాలస్వామి, ఎస్‌ఐలు సీ.వెంకట్‌రాములు, బి.మనోజ్‌ కుమార్‌, చిలకలగూడ ఇన్‌స్పెక్టర్‌ వి.రామకృష్ణ, సనత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.అశోక్‌, ఆదిబట్ల ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.సైదయ్య, ఎస్‌ఐలను ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -