– పరారీలో ముగ్గురు
– గోల్కొండ జోన్ అదనపు డీసీపీ బి. కృష్ణా గౌడ్ వెల్లడి
నవతెలంగాణ – ధూల్ పేట్
గత నెల 25న ఓ వ్యక్తిపై దాడి చేసి హత్యకు పాల్పడిన ఐదుగురు నిందితులను మంగళహాట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి మూడు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోషామహల్ ఏసీపీ సుదర్శన్‌తో కలిసి గోల్కొండ జోన్ అదనపు డీసీపీ బి. కృష్ణా గౌడ్ కేసు వివరాలు వెల్లడించారు. ధూల్‌పేట్ జుమ్మెరత్ బజార్ ప్రాంతానికి చెందిన మున్నా సింగ్ అలియాస్ మున్నా రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. లడ్డు సింగ్ అలియాస్ లడ్డు ప్రయివేటు ఉద్యోగి. హత్యకు రెండు రోజుల ముందు లడ్డు సింగ్, రుషబ్ అగర్వాల్‌ను మున్నాకు పరిచయం చేశాడు. సంభాషణలో చర్లపల్లి జైలు నుంచి ఇటీవలే విడుదలయ్యానని రుషబ్ చెప్పాడు. అలాగే అతను చర్లపల్లి జైలులో ఉన్న సమయంలో తన బరాక్‌లో మున్నా సింగ్‌పై కక్ష కట్టిన పాత నేరస్తులతో కలిసి ఉన్నానని మున్నాకు చెప్పినట్టు సమాచారం. ఈ విషయంతో మున్నాకు అనుమానం మొదలై రుషబ్‌పై దాడికి పథకం రచించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు మరుసటి రోజు లడ్డు సింగ్ సహాయంతో రుషబ్‌ను ఇంటి బయటకు పిలిపించి పరారీలో ఉన్న ముగ్గురితో కలిసి దాడి చేశారు. అనంతరం గణేష్ తయారీ యూనిట్‌కు తీసుకెళ్లి వారితో పాటు ఈ ఐదుగురు కలిసి కొట్టారు. తీవ్ర గాయాలతో రిషబ్ మృతి చెందడంతో అక్కడి నుంచి వారు పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గోల్కొండ జోన్ డీసీపీ చంద్ర మోహన పర్యవేక్షణలో సీసీ టీవీ ఫుటేజీల సాంకేతికతో దర్యాప్తు చేపట్టారు. ఇన్‌స్పెక్టర్ ఎస్ రాఘవేంద్ర బృందంతో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మున్నాసింగ్, లడ్డూ, ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పనిచేస్తున్న మద్దూరు ప్రణరు కుమార్, కార్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న తిప్పాని ఉదరు కిరణ్ అలియాస్ ఉదరు, లేబర్ వర్కర్‌గా ఉన్న కుశంగల్ ఓం ప్రకాష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితోపాటు అమినేష్ సింగ్ అలియాస్ అమ్రేష్, కునాల్ సింగ్, మాము నిందితులుగా ఉన్నారు. వీరు పరారీలో ఉన్నారు. కేసును ఛేదించిన ఇన్‌స్పెక్టర్ బృందాన్ని ఏసీపీ అభినందించారు. ఈ సమావేశంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌లు, క్రైమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
‘మంగళహాట్’ హత్యలో ఐదుగురు అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



