జాబితాలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, టాటా క్యాపిటల్
ముంబయి : వచ్చే వారం ఐదు కంపెనీలు ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రానున్నాయి. ఇందులో టాటా క్యాపిటల్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా వంటి రెండు పెద్ద సంస్థలు సహా మరో మూడు కంపెనీలు ఉన్నాయి. ఈ ఐదు సంస్థలు రూ.28,500 కోట్ల విలువ చేసే నిధులను సమీకరించాలనే లక్ష్యంతో స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తోన్నాయి. టాటా గ్రూపునకు చెందిన బ్యాంకింగేతర విత్త సంస్త టాటా క్యాపిటల్ ఇష్యూ అక్టోబర్ 6న ప్రారంభం కానుంది. ఈ సంస్థ మొత్తం రూ.15,512 కోట్లు మార్కెట్ నుంచి సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2025లో వస్తున్న అతిపెద్ద ఇష్యూల్లో ఇదొక్కటి. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.310-326గా నిర్ణయించింది.
ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇష్యూ అక్టోబర్ 7న ప్రారంభమై.. 9న ముగియనుంది. ఇందులో రూ.11,607 కోట్లు సమీకరించనుంది. షేర్ల ధరల శ్రేణిని రూ.1,080-1,140గా ప్రకటించింది. ఫార్మాస్యూటికల్ కంపెనీ రూబికాన్ రీసెర్చ్ మార్కెట్ నుంచి రూ.1,377 కోట్లు సమీకరించేందుకు అక్టోబర్ 9న సబ్‌స్క్రిప్షన్‌కు రానుంది. ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.461-481గా నిర్ణయించింది. అనంతమ్ హైవేస్ ఇన్విట్ సంస్థ రూ.400 కోట్లు సమీకరించేందుకు అక్టోబర్ 7 నుంచి పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఎస్‌ఎంఇ సెగ్మెంట్‌లో స్టీల్ ప్రొడక్షన్ కంపెనీ మిట్టల్ సెక్షన్స్ అక్టోబర్ 7న ఇష్యూకు రావడం ద్వారా రూ.53 కోట్లు సమీకరించనుంది. దీని ధరల శ్రేణిని రూ.136-143గా ఉంది.
వచ్చేవారం పబ్లిక్ ఇష్యూకు ఐదు కంపెనీలు
- Advertisement -
- Advertisement -