- Advertisement -
- – గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం:ఎంపీడీవో చిరంజీవి
- నవతెలంగాణ-రాయికల్: మండలంలోని అల్లీపూర్ రైతు వేదిక ఆవరణలో మంగళవారం నుండి ఈ నెల 21వ తేదీ వరకు ఐదు రోజుల పాటు గ్రామపంచాయతీ వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. మండలంలోని అల్లీపూర్, ఉప్పుమడుగు, ఆలూరు, రాజనగర్, శ్రీరాంనగర్, కిష్టంపేట్, అయోధ్య, కుర్మపల్లి, మహితాపూర్, వీరాపూర్, కుమ్మరి పెల్లి, సింగర్ రావుపేట, రామాజిపేట, చెర్లకొండాపూర్ గ్రామాలకు చెందిన వార్డు సభ్యులు ఈ శిక్షణలో పాల్గొంటున్నారు.గ్రామాభివృద్ధి పథకాల అమలు, గ్రామసభల నిర్వహణ, పంచాయతీ నిధుల సద్వినియోగం, పారదర్శక పాలన, పన్నుల వసూలు, స్వచ్ఛత కార్యక్రమాలు తదితర అంశాలపై అధికారుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించే విధానాలపై సూచనలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బింగి చిరంజీవి, ఎంపీఓ కె.సుష్మ, శిక్షణ అధికారులు పాల్గొని వార్డు సభ్యులకు మార్గదర్శనం చేశారు. గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని వారు పేర్కొన్నారు. ఈ శిక్షణలో ఆయా గ్రామాల వార్డు సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



