Tuesday, July 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఐదుగురు మావోయిస్టుల లొంగుబాటు

ఐదుగురు మావోయిస్టుల లొంగుబాటు

- Advertisement -

నవతెలంగాణ-ములుగు
వివిధ హోదాల్లో సీపీఐ(మావోయిస్టు)లో పని చేస్తున్న ఐదుగురు మావోయిస్టు సభ్యులు సోమవారం ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్‌ శబరిష్‌.పి సమక్షంలో లొంగిపోయారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. లొంగిపోయినవారిలో ఒకరు ఏసీఏం హోదాలో, నలుగురు పార్టీ సభ్యులుగా ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు తక్షణంగా ఒక్కొక్కరికి రూ.25వేల చొప్పున మొత్తం రూ.1.25లక్షలు అందజేశారు. మిగిలిన మొత్తం రూ.6,75,000ను ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ ఖాతా వివరాలు అందిన వెంటనే వారి ఖాతాల్లో చెక్కుల రూపంలో జమ చేయనున్నట్టు తెలిపారు. లొంగిపోయిన వారిలో చత్తీస్‌గఢ్‌ లోని సుక్మా జిల్లా జెట్టపాడు గ్రామానికి చెందిన శ్యామల రాజేష్‌ అలియాస్‌ ఐత (22), అదే జిల్లా గొమ్ము గ్రామానికి చెందిన కస్తిల్దుమ (20), బీజాపూర్‌ జిల్లా పెద్ద బట్టిగూడెం కొండపల్లి గ్రామానికి చెందిన ఊకె జోగి (18), అదే గ్రామానికి చెందిన బాడీసే బీమా (21), అదే జిల్లా తంబెల్‌బట్టి గ్రామానికి చెందిన ముచక జోగి(16) ఎస్పీ ముందు లొంగిపోయిన వారిలో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -