- Advertisement -
గుర్‌గావ్ : జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన ఎంజి విండ్సర్ విక్రయాల్లో భారీ వృద్ధిని సాధిస్తున్నట్టు తెలిపింది. 400 రోజుల్లో 50,000 యూనిట్ల పైగా అమ్మకాలు చేసినట్టు తెలిపింది. ప్రతీ గంటకు 5 యూనిట్ల చొప్పున విక్రయాలు జరిగాయని ఆ కంపెనీ ఎండీ అనురాగ్ మెహ్రోత్రా తెలిపారు. ఇది కంపెనీకి చారిత్రాత్మక విజయం, మైలురాయిని సూచిస్తుందన్నారు. మెట్రోయేతర మార్కెట్ల నుంచి ఎంజీ విండ్సర్ నిరంతర డిమాండ్‌ను చూస్తోందన్నారు. ఇది న్యూ ఎనర్జీ వాహనాల పట్ల మా నిబద్ధతను మరింతగా పెంచుకోవడానికి మద్దతునివ్వనుందన్నారు.
- Advertisement -



