Tuesday, May 6, 2025
Homeతెలంగాణ రౌండప్డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఐదుగురికి జైలుశిక్ష  ..

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఐదుగురికి జైలుశిక్ష  ..

- Advertisement -

21 మందికి జరిమాన
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: మద్యం సేవించి వాహనాలు నడిపిన ఐదుగురికి జైలు శిక్షపడింది. 21 మందికి జరిమానా విధించామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు. కమీషనర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో వాహనాదారులు మద్యం త్రాగి వాహనాలు నడుపడం వలన 25 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లునిర్వహించామన్నారు. ఈనెల 6న పోలీస్ స్టేషన్ల వారిగా పట్టుబడిన వారికి అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం వారిని మంగళవారం జిల్లా మార్నింగ్ కోర్టులో హజరు పరిచారు. విచారించిన స్పెషల్ జుడిషియల్ 2వ క్లాస్ మెజిస్ట్రేటు ఐదుగురికి జైలు శిక్ష విధించాలని తెలిపారు. కావున ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని పోలీసులు సూచించారు. వాహనదారులు పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -