27 మందికి జరిమానా
నవతెలంగాణ – కంఠేశ్వర్: డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఐదుగురికి శిక్ష పడింది. మరోక 27 మందికి జరిమానా విధించామని ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 32 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ గురువారం కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ ముందర హాజరుపరచగా 27 మందికి రూ.38500/-జరిమానా విధించి, కోట గల్లికి చెందిన శంకర్ ధర్మారం, సుభాష్ నగర్ క చెందిన ఎంబు సాయిలు అను వ్యక్తులకు ఒక రోజు జైలు శిక్ష పడిందని, కర్ణాటకకు చెందిన పరుశురాం, గౌతమ్ నగర్ కు చెందిన శనిగరం రాజు, నవీపేట్ కు చెందిన ఈదుల నరేందర్ లకు రెండు రోజుల జైలు శిక్ష పడిందని తెలిపారు.
డ్రంకన్ డ్రైవ్ లో ఐదుగురికి జైలుశిక్ష
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES