నవతెలంగాణ-ధూల్‌పేట
హైదరాబాద్‌లోని గోషామహల్ సమీపంలోని చాక్నవాడ ప్రాంతంలో కొత్త భవనం నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల కారణంగా పక్కనే ఉన్న ఐదంతస్తుల భవనం స్వల్పంగా కుంగిపోయింది. దాంతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకుని భవనంలో నివసిస్తున్న వారిని తక్షణమే ఖాళీ చేయించారు. ముందు జాగ్రత్తగా భవనం చుట్టుపక్కల నివసించే వారినీ అప్రమత్తం చేస్తూ అక్కడి నుంచి తరలించారు.
కొత్త భవనం నిర్మాణం కోసం పక్కనే జరిపిన తవ్వకాల కారణంగా భూమిలో గుంతలు ఏర్పడి పాత భవనానికి పగుళ్లు రావడంతో ఈ ప్రమాదకర పరిస్థితి ఉద్భవించినట్టు అధికారులు తెలిపారు. భవనం పక్కనే పిల్లర్ ఫౌండేషన్ కోసం జేసీబీతో భారీగా తవ్వకాలు జరపడంతో భవనానికి నెర్రలు వచ్చాయని స్థానికులు తెలిపారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే భవనం పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని, అలా జరిగితే పక్కన ఉన్న భవనాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. ఇక గతంలో ఇదే ప్రాంతంలో నాలా కుంగిన విషయం తెలిసిందే.
గోషామహల్‌లో తవ్వకాలతో కుంగిన ఐదంతస్తుల భవనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



