టీమ్ ఇండియా 2026 ఇంగ్లాండ్ పర్యటన
లండన్ : ఐదు టెస్టుల ‘టెండూల్కర్- అండర్సన్’ ట్రోఫీ కోసం ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా.. వచ్చే ఏడాది వైట్‌బాల్ సిరీస్ కోసం మళ్లీ అక్కడ పర్యటించింది. ఈ మేరకు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) 2026 భారత్, ఇంగ్లాండ్ వన్డే, టీ20 సిరీస్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. 2026 జులై 1న డర్హమ్‌లో తొలి టీ20తో ఆరంభం కానున్న టీ20 సిరీస్..జులై 11న సౌథాంప్టన్‌లో ముగియనుంది. జులై 14న బర్మింగ్‌హామ్‌లో, 16న కార్డిఫ్‌లో, 19న లార్డ్స్‌లో వన్డేలు జరుగుతాయి. భారత మహిళల జట్టు సైతం వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో ఓ టెస్టు సహా మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది. మే 28, 30, జూన్ 2న మూడు టీ20లు జరుగనుండగా.. ఏకైక టెస్టు మ్యాచ్ జులై 10 నుంచి లార్డ్స్‌లో జరుగుతుంది.
ఐదు టీ20, మూడు వన్డేలు
- Advertisement -
- Advertisement -