నవతెలంగాణ – ఆలేరు
ఆలేర్ మున్సిపాలిటీ బీసీ మహిళ చైర్మన్గా రిజర్వేషన్ కావడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతల్లో ఉత్సాహం నెలకొంది. ఐదుగురు బీసీ నేతలు తాము కౌన్సిలర్ గా పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ చైర్మన్ పదవి బీసీ మహిళ కావడంతో తమ భార్యలను చైర్మన్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.బీసీ మహిళా స్థానాలతో పాటు బీసీ జనరల్ లో కూడా తమ భార్యలను నిలబెట్టి చైర్మన్ పదవి కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. ముందుగా తమ భార్యలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించుకుని ఎమ్మెల్యే ద్వారా చైర్మన్ పదవి కోసం హామీ తీసుకొని ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తున్నారు.ఆదివారం అమావాస్య కావడంతో మంచి రోజు లేదని సోమవారం నుండి ముమ్మర ప్రయత్నాలు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
యాదాద్రి భువనగిరి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య ద్వారా కౌన్సిలర్ గా టికెట్టు ఇప్పించుకొని ఆలేరు మున్సిపాలిటీ చైర్మన్ గా పేరు ప్రకటింప చేస్తే ఎన్నికల్లో సిద్ధమవుతున్నారు.పైరవీల ద్వారా ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుల తో ఎమ్మెల్యేకు నచ్చజెప్పి ప్రయత్నాలు చేయనున్నారు.
చైర్మన్ రేసులో వీరే..
1ఎగ్గిడి జంగమ్మ శ్రీశైలం, 2 ఎం ఏ నహిద్ బేగం ఎజాజ్ , 3 ఎం డి సాజిదా బేగం సలీం, 4 ఆలేరులో బలమైన సామాజిక వర్గానికి చెందిన కీర్తితో పాటు 5 ఒక వ్యాపారవేత్త భార్య మున్సిపల్ చైర్మన్ అయ్యేందుకు.. తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.



