Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఐద్వా ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

ఐద్వా ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్
నాగారం గోశాల వద్ద అలాగే దొడ్డి కొమరయ్య నగర్లో ఐద్వా ఆధ్వర్యంలో జాతీడాను శుక్రరవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ..  బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందామని స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం కానీ మోడీ పాలనలో స్వదేశీ కంటే విదేశీ పెట్టుబడిదారులకే ప్రాధాన్యతనిస్తూ మన దేశంలో ఉన్న కొంతమంది కుబేరులకు తొత్తుగా పనిచేస్తూ విదేశీలకు ఆహ్వానం పలుకుతూ ప్రైవేటీకరణలు చేస్తా ఉన్నాడు. ఉదాహరణకు రైల్వే రిలయన్స్ బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి పేద ప్రజలకు ఉపయోగపడే వాటన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నాడు. విద్య వైద్యం అలాగే ఈమధ్య జరిగిన ఆపరేషన్ సింధుర్ ఇండియా పాకిస్తాన్ కి యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో మన సైనికులు ప్రాణాలు కోల్పోతే మన సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతే ఇక్కడ సైనికుల కోసం కానీ కోల్పోయిన ప్రజల కోసం గానీ మోడీ మాట్లాడడం లేదు.

  ఈ యుద్ధాన్ని మేమే ఆపినం నువ్వు ఆపలేదు అని కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇదే మనకు ఉదాహరణ అమెరికన్ సామ్రాజ వాదులకు తొత్తులుగా పనిచేస్తున్నారు. అనడానికి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రానున్న కాలంలో మన దేశాన్ని మన దేశ భవిష్యత్తు ని కాపాడుకోవాలంటే అందరూ పోరాటాలకు సిద్ధం కావలసిన అవసరం ఉంది అని గుర్తు చేశారు. ఈ సందర్బంగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో  శ్రీదేవి,  యశోద,  మంగళ్ బాయ్, లక్ష్మీబాయి,  సురేఖ,  రజియా, భాగ్యశ్రీ,  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad