Monday, March 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్

- Advertisement -

నవతెలంగాణ – బిచ్కుంద 
ఈనెల 11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఓటర్లకు భద్రతా భావన, ధైర్యం, విశ్వాసం కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని వార్డులో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజలు ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వరాదని పోలీస్ శాఖకు సహకరించాలని శాంతియుత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగే విధంగా సహకరించాలని ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలీసులు కోరారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి, బిచ్కుంద సీఐ రవికుమార్, బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య, ఎస్సై రాజు సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -